కరోనా గుట్టు విప్పేందుకు భారత్ కొత్త రకం పరీక్ష.. ప్రపంచంలోనే తొలిసారిగా

కరోనా వైరస్‌కు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకొనేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఓ కొత్త పరీక్షకు నడుం బిగించింది. ఈ కరోనా వైరస్‌కు సంబంధించి ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా పెద్ద ఎత్తున యాంటీబాడీ అనే పరీక్షలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. దీని ద్వారా టెస్టులు చేయనున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించిందిఈ టెస్ట్ ఎందుకంటే..
భారత దేశానికి విదేశాల నుంచి వచ్చినవారు.. వారిని కలిసిన వారు, లేదా వీరు మరెవర్నైనా కలిసిన వారికి జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తుంటే.. వారికి కరోనా వైరస్ సోకిందా? లేదా? అనేది తేల్చేందుకు వీరి నుంచి ముక్కు లేదా గొంతు ద్వారా కొన్ని నమూనాలను సేకరిస్తారు. వీటికి వివిధ పరీక్షలు చేస్తారు. అయితే, దేశంలో కరోనా గ్రూపునకు చెందిన వైరస్ ఇంతకుముందు ఎవరికైనా సోకిందా? మరి ఎలాంటి లక్షణాలు కనిపించకుండా వారికి సహజంగానే వైరస్ తగ్గిపోయిందా? అనేది ఈ యాంటీబాడీ పరీక్షల్లో తేలనుంది. ఒకవేళ ఈ కరోనా వైరస్ ఇంతకుముందు ఎవరికైనా సోకి దానంతట అదే తగ్గిపోయినట్లు గుర్తిస్తే, అలా జరగడానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తారు.వారి రక్తంలో వైరస్‌ను నాశనం చేసేందుకు ఏర్పడ్డ యాంటీబాడీలు ఉంటాయి. ఈ టెస్టు ద్వారా ఆ యాంటీబాడీలను గుర్తిస్తే.. వైరస్ పనితీరు, దానిని అంతం చేసేందుకు ఉన్న అవకాశాల గురించి పరిశోధించవచ్చు. రక్తంలో యాంటీబాడీలను గుర్తించే ఈ పరీక్షను యాంటీబాడీ టెస్ట్ అనే కాకుండా సీరాలజీ టెస్ట్ అని కూడా పిలుస్తుంటారు.