గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కామెంట్స్.

గుంటూరులో 2, మాచర్లలో 2, కారంపూడిలో ఒక కేసు బయటపడ్డాయి. మొత్తం ఇప్పటికి 9 కేసులు వచ్చాయి. 180 మందిలో 140 మందిని గుర్తించాం..
* 103 కేసులు చెక్ చేశాం. అందులో ఐదుగురికి పాజిటివ్ వ‌చ్చింది. మిగిలిన 40 మంది కోసం వెతుకుతున్నాం..
* ఢిల్లీలో మీటింగ్‌కి వెళ్లినవారితో పాటు  వారి భార్యలకు పాజిటివ్ కేసులు వచ్చాయి..
* ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు స్వచ్చందంగా టెస్ట్ చేయించుకోవాలి.. అలా కాకుండా మాకు పట్టుబడితే కఠినంగా చర్యలు ఉంటాయి..
* నోటిసులు అందుకొని బయట తిరిగితే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తాం
* కారంపూడి, మాచర్ల, గుంటూరులో కర్ఫ్యూ విధించాము
* పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో ఇంటికే వెళ్లి కూరగాయలు, నిత్యావస‌రాలు అందిస్తాం